

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న భారీ చిత్రం ఫౌజీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చారిత్రక యాక్షన్ కథ ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు సినిమా నుంచి రాబోయే కంటెంట్‌పై నిర్మాత నవీన్ యెర్నేని కీలకమైన సమాచారం వెల్లడించారు. ఈ నెల నుంచే ఫౌజీకి సంబంధించిన కొత్త కంటెంట్‌ను విడుదల చేయడం ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
అంతేకాదు, ఇకపై వచ్చే ప్రతి ప్రచార అంశం ప్రేక్షకుల్లో సంచలనం సృష్టించేలా ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రభాస్ అభిమానులు తదుపరి అప్‌డేట్ల కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా కథ, పాత్రలు, ప్రభాస్ లుక్, సంగీతం వంటి అంశాలపై ఇప్పటికే భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదలకు ముందే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!