

ప్రస్తుతం సినిమా రంగంలో ఏఐ వినియోగం పెరుగుతున్న సమయంలో పూర్తిగా మానవ సృజనాత్మకతతో రూపొందిన చిత్రం ‘ఫస్ట్ టైం’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి కథ, దర్శకత్వం, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పరిమిత బడ్జెట్‌తో ఉన్నత స్థాయి సాంకేతిక నాణ్యతను అందించేందుకు చేసిన ప్రయత్నం సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ దర్శకుడి అంకితభావాన్ని ప్రశంసిస్తూ, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటారని పేర్కొన్నారు. హీరో సౌరబ్ ధింగ్ర నటించిన ఈ చిత్రం భావోద్వేగ కథతో పాటు ఆకట్టుకునే విజువల్స్‌ను అందించనుందని చిత్రబృందం చెబుతోంది. ట్రైలర్, ప్రచార చిత్రాలకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!