

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు, పోలీసుల చర్యలు, వివిధ సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనల మధ్య జీవించేవారని, ప్రస్తుతం అక్కడి ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య పెద్ద సవాలుగా మారుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో గంజాయి సాగు లేదని స్పష్టం చేశారు. హింసాత్మక కార్యకలాపాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం, పోలీసు శాఖ అన్ని విధాలా సహకరిస్తున్నాయని వెల్లడించారు.
మరోవైపు, పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆన్‌లైన్ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ సమస్య, సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!