
క్రీడలు

సూర్య వశిష్ట, దీప్షిక ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రమణి కళ్యాణం’ చిత్ర టీజర్‌ను సహజనటి జయసుధ విడుదల చేశారు. భావోద్వేగ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన జయసుధ, తాను ఇప్పటికే సినిమా చూశానని, ఇది ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చే అద్భుతమైన చిత్రమని తెలిపారు.
ఈ సినిమాలో నటీనటులు చాలా సహజంగా నటించారని, సంగీతం కూడా ఆకట్టుకుంటుందని జయసుధ పేర్కొన్నారు. హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ వీల్‌చైర్‌లో నటించడం తనకు సవాలుగా అనిపించిందన్నారు. కథానాయిక దీప్షిక చూపులేని యువతి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించామని చిత్ర బృందం వెల్లడించింది. ఈ నెల 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!