
సినిమాలు

‘జాతిరత్నాలు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరియా అబ్దుల్లా తన సినీ జీవితంలో ఇప్పటికీ బాధపడే విషయం ‘హనుమాన్’ సినిమా అవకాశాన్ని తిరస్కరించడమేనని వెల్లడించింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పెద్ద తప్పు చేశానని తెలిపింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందేనని ఫరియా చెప్పింది. ఆ పాత్ర ప్రాముఖ్యతను అప్పట్లో అర్థం చేసుకోలేకపోయానని, ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు బాధపడుతున్నానని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆశలు అన్నీ ‘గాయపడ్డ సింహం’ చిత్రంపైనే ఉన్నాయని తెలిపింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!