
క్రీడలు

పెద్ది సినిమా వచ్చే నెల 4 న ఎలాంటి ఇబ్బందులు లేకుండా విడుదలవుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య జరిగిన సమావేశంలో సమస్యలపై చర్చించి పరిష్కారానికి వచ్చినట్లు చెప్పారు. పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏ, బీ, సీ సెంటర్ల ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఈ విధానం వల్ల నష్టం వస్తుందని నిర్మాతలు అంటుండగా, ఎగ్జిబిటర్లు మాత్రం ఇది తమ పాత డిమాండ్ అని చెబుతున్నారు. సురేశ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఈ వివాదానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!