

మలయాళ సినీ నటి ఎస్తర్ అనిల్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘దృశ్యం’ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా మోహన్‌లాల్ కుమార్తె పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘దృశ్యం 3’కు అద్భుతమైన స్పందన లభించడంతో చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది. సినిమా విడుదలైన రోజున థియేటర్‌లో ప్రేక్షకుల స్పందనను చూసిన ఎస్తర్, మోహన్‌లాల్ పక్కన కూర్చొని భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆమెను ప్రశంసించారు.
అయితే ఇదే సమయంలో ఓ నెటిజన్ చేసిన ట్రోల్ కామెంట్ వివాదానికి దారి తీసింది. “మోహన్‌లాల్‌కు ఇది కొత్త కాదు.. నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావ్?” అంటూ చేసిన వ్యాఖ్యకు ఎస్తర్ వెంటనే స్పందిస్తూ “మధ్యలో నీకేంటి సమస్య?” అని కౌంటర్ ఇచ్చింది. ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యమైన స్పందనకు అభిమానులు మద్దతు తెలుపుతూ ట్రోలర్లకు ఇది సరైన జవాబని అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరైంది కాదని కూడా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!