

‘పెళ్లి’, ‘కోరుకున్న ప్రియుడు’, ‘మనసిచ్చి చూడు’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన వడ్డే నవీన్, కొంత గ్యాప్ తర్వాత ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ సినిమాతో హీరోగా తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవీ ప్రసాద్, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే నవీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 19 న విడుదల కానుంది. కల్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘టా టా’ అనే తొలి పాటను విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించగా, నకాష్ అజీజ్ ఆలపించారు. విజయ్ పోలాకి మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. నిజాయతీ గల కానీ మొండితనంతో ఉండే ఒక కానిస్టేబుల్ పాత్రను ప్రతిబింబించే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన టీజర్ మంచి స్పందన పొందగా, ఈ వినోదాత్మక చిత్రంలో వడ్డే నవీన్ నటనలో కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూడగలరని చిత్ర బృందం తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!