

సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం (ఫిబ్రవరి 1) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు జయంత్ సి పరాన్జీ, ఆది సాయి కుమార్, జేడీ చక్రవర్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో చంద్రహాస్ మాట్లాడుతూ, సినిమా లెక్కపెట్టలేనన్ని, ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ అందించిన పాటలు, సంపత్ రుద్ర తెరకెక్కించిన విజువల్స్ ప్రేక్షకులను అలరించనున్నాయని తెలిపారు.
ఈవెంట్లో ఆది సాయి కుమార్, మేఘన ముఖర్జీ, ప్రభాకర్, జేడీ చక్రవర్తి, నిర్మాతలు చందు, చిన్ని, వెంకీ తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానంగా చంద్రహాస్ మంచి హిట్ కొట్టాలని, మేఘనకు మంచి రైజ్ రావాలని, చిత్రాన్ని ఈ నెల 6 న ప్రేక్షకులు తప్పక చూడాలని వారు అభ్యర్థించారు. సినిమా వేదిక, బ్యాక్‌డ్రాప్, పాటలు మరియు నటీనటుల నటనకు ప్రత్యేక ప్రశంసలు వెల్లువెత్తాయి.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!