

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ‘స్త్రీ-2’ ఘన విజయానంతరం నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఈత’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రముఖ లావణీ కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో ఆమె ఎదుగుదల, కళాప్రస్థానం, ఎదుర్కొన్న సవాళ్లను భావోద్వేగంగా చూపించనున్నారు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కెరీర్లో గుర్తుండిపోయే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఛావా’ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. రణదీప్ హుడా, మహ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘స్త్రీ-2’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!