

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. టీజీ ఈఏపీసెట్ 2026లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎం. రుషిని ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో స్టేట్ టాప్ చేసిన తొలి అమ్మాయిగా రుషి చరిత్ర సృష్టించింది.
రెజొనెన్స్ జూనియర్ కాలేజీ విద్యార్థినిగా ఉన్న రుషి, తన కుటుంబంతో కలిసి చిరంజీవిని కలిసింది. చిన్నప్పటి నుంచే మెగాస్టార్‌ను కలవాలని కలగన్న రుషికి ఇది నిజమైన కల సాకారమైన క్షణంగా మారింది. ఆమె ప్రతిభను మెచ్చుకున్న చిరంజీవి ప్రోత్సాహకంగా ల్యాప్‌టాప్ బహుమతిగా అందించారు. ఇంజినీరింగ్ చేసి ఐఏఎస్ అవ్వాలన్న తన లక్ష్యాన్ని రుషి వివరించగా, ఆమెకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విద్యార్థులకు చిరంజీవి ప్రేరణగా నిలిచారని పలువురు ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!