
సినిమాలు

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’పై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. నహాష్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ను పలు భారతీయ భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల వచ్చిన చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో దుల్కర్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న ఆయన, కథ, యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక నాణ్యత వంటి అంశాలపై స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!