

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంగీత విభాగంలో మార్పులు చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు వ్యక్తిగత కారణాలతో కొంతకాలం విరామం తీసుకోవాలని భావించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే షారుఖ్ ఖాన్‌పై ఉన్న గౌరవంతో ‘కింగ్’ సినిమా థీమ్ ట్రాక్‌ను అనిరుధ్ స్వయంగా స్వరపరిచినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై షారుఖ్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో చర్చించిన తర్వాతే ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం. అనిరుధ్ స్థానంలో ప్రముఖ సంగీత దర్శకుల ద్వయం సచిన్-జిగర్ బాధ్యతలు చేపట్టి ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకోణె, అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాను డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!