

భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ లిస్టెడ్ కంపెనీలకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఓపెన్ మార్కెట్‌లో షేర్ల బైబ్యాక్ చేసే విధానాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు బైబ్యాక్ ప్రక్రియను 66 పని దినాల్లో పూర్తి చేయాలి. అలాగే ప్రత్యేక బైబ్యాక్ విండో అవసరం లేకుండా సాధారణ ట్రేడింగ్ విధానంలోనే షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు సెబీ అనుమతి ఇచ్చింది. దీంతో కంపెనీలకు ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
అయితే కొన్ని పరిమితులు కూడా అమల్లో ఉంటాయి. ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ విలువ కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్, ఫ్రీ రిజర్వ్స్‌లో 15 శాతం మించకూడదు. పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణ, పన్ను సంబంధిత అంశాల కారణంగా 2025లో ఈ విధానాన్ని సెబీ నిలిపివేసింది. ఇప్పుడు సవరించిన నిబంధనలతో తిరిగి అనుమతించడం వల్ల అదనపు నగదును వాటాదారులకు అందించడంతో పాటు మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో షేర్ ధరకు మద్దతు లభించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!