
జనరల్

దర్శకుడు సంపత్ నంది భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం భోగి లో హీరోగా శర్వానంద్ నటిస్తున్నారు. ఆగస్టు 28న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం డింపుల్ హయాతి లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె ‘మందారం’ అనే బోల్డ్ పాత్రలో కనిపించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
“ప్రపంచానికి ఆమె సౌందర్యం కావాలి.. కానీ ఆమె మనసును ఎవరూ అర్థం చేసుకోరు” అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదివరకే అనుపమపరమేశ్వరన్ పాత్రను ‘కందుల సులోచన రాణి’గా పరిచయం చేశారు. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ కథను భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!