
జనరల్

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆయన తదుపరి ప్రాజెక్టును కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం.
‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ తేజ కాకుమాను దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘పరువేట’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్సవం నేపథ్యంగా ఈ కథ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!