
టెక్నాలజీ

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను సొంతం చేసుకుంది. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో ఈ చిత్రం డే-1 వరల్డ్‌వైడ్‌గా రూ.1.89 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. హార్ట్ టచింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని విడుదల చేశారు. మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!