

తమిళనాడు సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. రాష్ట్రంలో ఉదయం ప్రత్యేక సినిమా షోలపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 2023లో అజిత్ నటించిన ‘తునివు’ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం ఉదయం ప్రత్యేక షోలపై ఆంక్షలు విధించడంతో పాటు రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. తాజాగా ఈ నిబంధనలను సడలించడంతో థియేటర్లలో అదనపు షోలు ప్రదర్శించేందుకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయం తమిళ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలయ్యే సినిమాలకు ఊరటనివ్వనుంది.
ముఖ్యంగా దీపావళి సందర్భంగా విడుదల కానున్న సినిమాలకు ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారనుంది. సూర్య నటించిన ‘సీన్స్’, నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మూకుతి అమ్మన్ 2’, ‘రామాయణ’ వంటి చిత్రాలకు అదనపు షోల వెసులుబాటు కలిసిరానుంది. తొలి వారంలో ఎక్కువ షోలు ప్రదర్శించే అవకాశం ఉండటంతో ప్రేక్షకులకు టికెట్లు సులభంగా లభించడంతో పాటు బాక్సాఫీస్ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై తమిళ సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తూ, పరిశ్రమకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!