

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్., సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని చిత్రబృందం మరింత పెంచింది.
ఇందులో భాగంగా ‘లవ్ కార్నివల్’ పేరుతో ప్రత్యేక ఈవెంట్‌ను ఈ నెల 4న సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రబృందం కూడా సినిమా విజయంపై నమ్మకంతో ఉంది. విడుదల తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.













కామెంట్స్ (1)
❤️