

యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. చిత్రంలోని మతపరమైన దృశ్యాలపై నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా క్రైస్తవ మతానికి చెందిన సెయింట్ మైఖేల్ చిత్రణను అభ్యంతరకరంగా చూపించారని ఆరోపిస్తూ, వివాదాస్పద దృశ్యాలను తొలగించాలని మరియు చిత్రబృందం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో, టీజర్లో ఉన్న కొన్ని బోల్డ్ సన్నివేశాలపై కర్ణాటక మహిళా కమిషన్ కూడా ముందుగా అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు ఫిర్యాదులు ప్రభుత్వ, సినీ అధికారులకు చేరడంతో సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డు కఠినంగా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వాణీ, హుమా ఖురేషీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా చుట్టూ వివాదాలు కొనసాగుతుండటం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!