

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న కొత్త బయోపిక్ మా వందే అధికారికంగా ప్రకటించబడింది. క్రాంతి కుమార్ సి.హెచ్. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ది ఆంథమ్ ఆఫ్ ఎ మదర్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. చిన్నప్పటి నుంచి దేశ నాయకుడిగా ఎదిగిన మోదీ జీవనప్రయాణాన్ని, ముఖ్యంగా ఆయన తల్లి హీరాబెన్ మోదీతో ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రం భావోద్వేగంగా చూపించనుంది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నటించగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ హీరాబెన్ పాత్రలో కనిపించనున్నారు.
వీర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సిల్వర్ క్యాస్ట్ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కెమెరామెన్ కేఎకే సెంటిల్ కుమార్, సంగీతం రవి బస్రూర్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్, యాక్షన్ కింగ్ సోలోమన్ వంటి టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రంలో పనిచేస్తున్నారు. ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ, “మోదీ గారు సీఎం గా ఉన్నప్పుడు నేనూ అహ్మదాబాద్‌లో పెరిగాను. ఆయన పాత్రలో నటించడం నాకు గౌరవంగా ఉంది” అన్నారు. మా వందే మోదీ వ్యక్తిత్వంలో తల్లి పాత్ర ఎంత ముఖ్యమో చూపించే భావోద్వేగ గాథగా నిలవనుంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!