
క్రీడలు

నటుడు అలీ తాజాగా ఓ సబ్బు ప్రకటనతో వివాదంలో చిక్కుకున్నారు. ఆ యాడ్లో అలీ సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తున్నట్టు చూపించగా, బ్యాక్గ్రౌండ్లో లక్ష్మీదేవి మంత్రాలు వినిపించడం హిందూ సంఘాల ఆగ్రహానికి దారి తీసింది. మత భావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ అలీని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
వివాదం ముదరడంతో అలీ క్షమాపణ చెప్పారు. ఈ ప్రకటన తన గతంలో చేసిన ఓ సినిమాలోని సన్నివేశాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిందని, ఎవరి భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం లేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!