
జనరల్

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న పళ్ల బురుసు చిత్రం ప్రకటన నాటి నుంచే మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేటివిటీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బోనాల పండుగ సందర్భంగా ‘ఇచ్చి పడేద్దాం’ అనే మాస్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
పవన్ సీఎచ్ స్వరపరిచిన ఈ ఉత్సాహభరితమైన పాటకు మనీషా, నితేష్ గాత్రం అందించగా, సురేష్ గంగుల సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ చేసిన తీన్‌మార్ స్టెప్పులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!