

తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేళ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎస్.ఎస్. రాజమౌళి వంటి దర్శకుల కృషితో టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. తెలుగు సినిమా విజయాలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్వాగతిస్తుండగా, కొందరి వ్యాఖ్యలు మాత్రం వివాదానికి దారి తీస్తున్నాయి.
తాజాగా టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలు వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాయంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టుకు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఊప్స్’ అంటూ స్పందించారు. ఆ పోస్టును నెటిజన్ తొలగించినప్పటికీ, దర్శకుడి స్పందన మాత్రం సోషల్ మీడియాలో కొనసాగింది. దీంతో తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వార్’, ‘పఠాన్’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ ఇలాంటి స్పందన ఎందుకు చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభాస్‌ను ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’గా పేర్కొన్న సందర్భంలోనూ ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!