

గూగుల్ ఫొటోస్‌లో ఫొటోలను లొకేషన్ ఆధారంగా వెతికే విధానాన్ని మరింత సులభతరం చేసే కొత్త ఫీచర్‌పై సంస్థ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. Ask Photosలో భాగంగా మ్యాప్ వ్యూను తీసుకురావడానికి గూగుల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. Android Authority నివేదిక ప్రకారం, Google Photos టెస్ట్ వెర్షన్‌లో Map అనే ఆప్షన్ కనిపించింది. లొకేషన్ సెర్చ్ చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో తీసిన ఫొటోలను మ్యాప్‌పై చూపించేలా ఈ ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ మ్యాప్‌లో సమీప ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు నంబర్లతో కూడిన క్లస్టర్లుగా కనిపించనున్నాయి. నంబర్ ద్వారా ఆ ప్రాంతానికి సంబంధించిన ఫొటోల సంఖ్యను తెలుసుకోవచ్చు. జూమ్ చేసి వేర్వేరు క్లస్టర్లను చూడటంతో పాటు, వాటిపై ట్యాప్ చేసి సంబంధిత ఫొటోలను ఓపెన్ చేసే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ట్రిప్స్, హాలిడేస్ సమయంలో తీసిన ఫొటోలను ప్రాంతాల వారీగా వెతకడానికి ఈ ఫీచర్ ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఇది ప్రస్తుతం పరీక్ష దశలోనే ఉన్నట్లు సమాచారం. గూగుల్ అధికారికంగా ఈ ఫీచర్‌ను ప్రకటించలేదు. కాబట్టి భవిష్యత్తులో ఇది మారవచ్చు లేదా పబ్లిక్‌గా అందుబాటులోకి రాకపోవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!