

భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దృశ్యకావ్యం ‘బాహుబలి’ మరోసారి వెండితెరపై మాయ చేసేందుకు సిద్ధమైంది! సినిమా విడుదలై దాదాపు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రీ రిలీజ్ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఈసారి కేవలం పాత సినిమాను తిరిగి ప్రదర్శించడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించేందుకు సాంకేతికంగా ఎన్నో మార్పులు చేశారు.
అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లయిన IMAX, 4DX, Dolby Cinema లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
రీమాస్టర్ చేసిన పిక్చర్ క్వాలిటీ, అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్‌తో ‘బాహుబలి’ ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశం కలగనుంది.
రెండు భాగాలను కలిపి రూపొందించిన ఈ సింగిల్ వెర్షన్ నిడివి 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేశారు. ఇప్పటికే ఈ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఒక దశాబ్దం తర్వాత తమ అభిమాన సినిమాను IMAX వంటి ఆధునిక ఫార్మాట్లలో చూడబోతున్నందుకు సినీప్రియులు, ప్రేక్షకులు అమితాసక్తిగా ఎదురు చూస్తున్నారు.











కామెంట్స్ (1)
Good to see : )