
ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న విడుదల కానున్న 'పెద్ది' సినిమాకు టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాతల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షోల కోసం మేకర్స్ తీసుకుంటున్న కొత్త వ్యూహం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా అర్ధరాత్రి తర్వాత జరిగే షోల బదులు రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు ఆకర్షించాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీమియర్ టికెట్ ధరలను కూడా సుమారు రూ.600కు పరిమితం చేసినట్లు సమాచారం. జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ షోలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!