

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో తన తదుపరి చిత్రం ఎస్డీటీ19ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాకు దర్శక ద్వయం సుజిత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సాయి దుర్గా తేజ్ తన స్వంత నిర్మాణ సంస్థ ద్వారా గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు.
విజయదుర్గ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుండగా, సాహు గారపాటికు చెందిన షైన్ స్క్రీన్స్ సహనిర్మాణం అందిస్తోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రీ లుక్ పోస్టర్లో సాయి దుర్గా తేజ్ దట్టమైన అడవిలో యోధుడిలా కనిపిస్తూ ఫాంటసీ నేపథ్యాన్ని సూచించాడు. ఈ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మెగా అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!