

సాధారణంగా సినిమా మేకర్స్ స్టార్ హీరోల చిన్న వయసు పాత్రల్లో వాళ్ల కుటుంబ సభ్యులనే లేదా వారిలాగే కనిపించే పిల్లలను తీసుకుంటారు. అలా తీసుకుంటే హావభావాలు, ముఖ సాదృశ్యం సహజంగా సరిపోతాయి. ఇక సుధీర్ బాబు విషయం చూస్తే ఆయన మహేష్ బాబు బావ. సుధీర్ బాబు, ప్రియదర్శిని (మహేష్ బాబు సోదరి) భర్త. వీరికి ఇద్దరు కుమారులు చరిత్ మానస్, దర్శన్.ఇందులో పెద్దవాడు చరిత్ మానస్, వయసు 19 సంవత్సరాలు. ఆయన లుక్స్, స్మైల్, బాడీ లాంగ్వేజ్ అంతా మహేష్ బాబును గుర్తు చేస్తాయి. చరిత్ మానస్ అప్పుడే "భలే భలే మగాడివోయ్" (2015) సినిమాలో చిన్న నానీగా నటించాడు. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. మరోవైపు చిన్నవాడు దర్శన్ ఇప్పటికే చిన్న పాత్రల్లో తన ప్రతిభ చూపించాడు. “గూడచారి” (2018)లో చిన్న అడివి శేష్ పాత్రలో నటించాడు. “సర్కారు వారి పాట” (2022)లో చిన్న మహేష్ బాబు పాత్ర కూడా ఆయనదే.
ఇప్పుడు తాజాగా దర్శన్‌కి మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది ప్రభాస్ చిన్న వయసు పాత్రలో నటించే అవకాశం దక్కింది! “ఫౌజీ” సినిమాలో చిన్న ప్రభాస్‌గా దర్శన్ నటిస్తున్నాడని సుధీర్ బాబు తన “జటాధర” సినిమా ప్రమోషన్స్ సమయంలో కన్ఫర్మ్ చేశారు. ఈ పాత్రలో సంస్కృతంలో పెద్ద డైలాగులు ఉంటాయట. ఆ డైలాగులు దర్శన్ నిస్సంకోచంగా చెప్పాడని సినిమా యూనిట్ చెబుతోంది. ఇలా సుధీర్ బాబు కుమారులు ఇద్దరూ సినిమాల వైపు అడుగులు వేస్తుండడంతో, మహేష్ బాబు, సుధీర్ బాబు కుటుంబం మొత్తం సినిమా రూట్లో బలంగా ఉందని చెప్పొచ్చు. “ఫౌజీ” సినిమా ఒక హిస్టారికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. ఇందులో ప్రభాస్ హీరోగా, ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!