

ప్రఖ్యాత చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మరోసారి చరిత్ర సృష్టించారు. 20 ఏళ్ల కంటే ఎక్కువ వ్యవధిలో 114కి పైగా చిత్రాలను నిర్మించిన ఆయన, గతేడాది ఆగస్టు 15 న ఒక్కసారిగా 15 చిత్రాలను ప్రారంభించి ప్రపంచ రికార్డు నెలకొల్పడం తెలిసిందే. ఇప్పుడు ఆ 15 చిత్రాల్లో 7 చిత్రాల షూటింగ్స్ పూర్తయి, ట్రైలర్స్ అన్ని ఒకే రోజు భీమవరం టాకీస్ వద్ద ఆవిష్కరించబడ్డాయి.
ఆ 7 చిత్రాలు: ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో మహానాగ, రవి బాసర దర్శకత్వంలో యండమూరి కథలు, విజయ్ ఎర్రంశెట్టి దర్శకత్వంలో మా నాన్న హీరో, నూతన్ దర్శకత్వంలో రోబో-47, మహాబలుడు, హర్ష దర్శకత్వంలో రుద్రతాండవం, సాయి రమేష్ దర్శకత్వంలో మనమ్-2036. ఈ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, రచయితలు, ప్రధాన అతిథులు అందరూ పాల్గొని చిత్ర బృందాలను అభినందించారు. 15 చిత్రాల సంగీతం డా. ఎ. జె. సంధ్యవర్షిణి మరియు డా. వి.ఆర్.ఎ. ప్రదీప్ అందిస్తున్నారు.
.jpeg)
తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రకారం, రికార్డు స్థాయిలో షూటింగ్ పూర్తి చేసి, ట్రైలర్స్ సిద్ధం చేసిన దర్శకులకు ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. మిగతా 8 చిత్రాల ట్రైలర్స్ త్వరలో విడుదల చేయాలని, ఈ 15 చిత్రాలను ఈ సంవత్సరం ఆగస్టులోపు ప్రేక్షకుల ముందుకు తెచ్చి మరో రికార్డు సృష్టించబోతున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!