
జనరల్

బాలీవుడ్ నటి అనన్య పాండే నటించిన ‘చాంద్ మేరా దిల్’ సినిమాలోని ఒక భరతనాట్యం డ్యాన్స్ సీన్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ క్లిప్స్ వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్లు, రాజకీయ నాయకులు, కళాకారులు ఆమె సంప్రదాయ నృత్యాన్ని అవమానించిందని విమర్శలు చేశారు. ఈ అంశంపై మీమ్స్ కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి.
తాజాగా ఈ వివాదంపై అనన్య పాండే స్పందిస్తూ, ట్రోలింగ్‌ను ఇక పట్టించుకోనని, నెగిటివిటీ నుంచి బయటపడ్డానని చెప్పింది. ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలని, పాజిటివిటీపై దృష్టి పెట్టాలని ఆమె వ్యాఖ్యానించింది. అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!