

భూమి శెట్టి ‘నిన్నే పెళ్లాడతా’ ధారావాహిక ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఇప్పుడు భారీ పాన్-ఇండియా చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ‘మహాకాళి’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న భూమి శెట్టి, తాజాగా కోల్కతాలో జరిగిన కీలక చిత్రీకరణ షెడ్యూల్ను పూర్తి చేసింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగ పోస్టు పెట్టిన ఆమె, అక్కడ గడిపిన 12 రోజులు తనకు రోలర్ కోస్టర్ ప్రయాణంలా అనిపించాయని పేర్కొంది.
చిత్రీకరణ విరామ సమయంలో కోల్కతా వీధుల్లో తిరుగుతూ స్థానిక ప్రజల సంస్కృతి, చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానని భూమి తెలిపింది. కళలకు నిలయమైన ఆ నగరం తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని చెప్పింది. ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న ఈ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ పురాణాలు, బెంగాల్ సంస్కృతి ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తుండగా, రోహిత్ సరాఫ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!