
గాసిప్స్

అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ కలయికలో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక కాన్సెప్ట్ వీడియోతో అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా సోషల్ మీడియాలో భారీ స్పందనను దక్కించుకుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతుండగా, ఈ ఏడాదిలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో చేస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే చిత్రబృందం ఈ సినిమాను 2026లోనే ప్రారంభిస్తామని వెల్లడించింది. వేసవి అనంతరం షూటింగ్ ప్రారంభించి అదే సంవత్సరంలో చిత్రాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో అల్లు అర్జున్ ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!