
జనరల్

కామెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న ప్రముఖ యూట్యూబ్ షో ‘ఇండియాస్ గాట్ లాటెంట్ సీజన్ 2’ సెట్స్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో బాలీవుడ్ నటీమణులు అలియా భట్, శర్వరి జడ్జీల ప్యానెల్లో కనిపించగా, తమ రాబోయే స్పై యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’ ప్రమోషన్స్‌లో భాగంగా వారు షోలో పాల్గొన్నట్లు సమాచారం. కామెడియన్స్ ఆశిష్ సోలంకి, బాల్‌రాజ్ ఘాయ్ కూడా ఫొటోలో కనిపించారు.
ఈ క్రాస్ఓవర్పై అభిమానులు భారీ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ బాలీవుడ్ స్టార్స్ ఎంట్రీతో షో అసలు కామెడీ స్టైల్ మారిపోతుందేమోనని కొందరు ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ కలయిక షోకు మరింత క్రేజ్ తెస్తుందని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!