

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎప్పుడూ చర్చ జరిగే విషయం—ఆయన కొడుకు ఆకిరా నందన్ సినీ ఎంట్రీ ఎప్పుడొస్తుంది? అన్నదే. చిన్నప్పటి నుంచే ఆకిరా మీద క్రేజ్ ఉండగా, ఇప్పుడు తాజా ఫోటోతో ఆ హైప్ మరింత పెరిగింది.
తాజాగా పవన్ కళ్యాణ్ – ఆకిరా నందన్ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆకిరా పూర్తిగా మేచ్యూర్, స్టైలిష్, పర్ఫెక్ట్ అర్బన్ లుక్ తో కనిపిస్తున్నాడు. హైట్, ఫిజిక్, బాడీ లాంగ్వేజ్—all set for a hero look అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ పక్కన నిల్చున్న ఆకిరా అత్యంత కాన్ఫిడెంట్‌గా, మాన్లీ ప్రెజెన్స్‌తో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ ఫోటో బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఒకేసారి రిక్వెస్ట్ చేస్తున్నారు:
“అన్నయ్యా… ఆకిరా డెబ్యూ ఎప్పుడవుతుంది? ఇండస్ట్రీకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు?” అని.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఆకిరా సినిమాలపై ఎలాంటి ప్రెజర్ చేయట్లేదు. ఆయన ఎక్కువగా ఆకిరాను ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు తీసుకెళ్తూ, జీవిత అనుభవాలను నేర్పడంపైనే దృష్టి పెట్టారు.
ఇక ఆకిరా కూడా ప్రస్తుతం ఫిల్మ్ ఎంట్రీ విషయంలో ఎలాంటి హడావిడి చేయకుండా, తన స్టడీస్ మరియు పర్సనల్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అయినా… ఈ ఫోటో చూసిన అభిమానుల మాట ఒకటే:
“పవర్ స్టార్ వారసుడి లుక్ రెడీ… ఎంట్రీ కూడా త్వరగా రావాలి!”











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!