
గాసిప్స్

నటుడు అజిత్‌కుమార్ అభిమానులు తమిళనాడులో ‘తమిళగ మక్కల్ కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కళ్లకురిచి జిల్లా ఉలందూరుపేట సమీపంలోని ఎలవనాసూర్‌కోటైలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించి, కొత్త జెండాను ఆవిష్కరించారు. అజిత్ అభిమానులు, మద్దతుదారులు కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆబిత్, రాష్ట్ర కార్యదర్శిగా రామ్‌కుమార్, కోశాధికారిగా మహమ్మద్ షాలను నియమించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అజిత్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఖాళీగా ఉంచినట్లు పార్టీ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ పార్టీని అజిత్ స్వయంగా ప్రారంభించినట్లు ఎలాంటి సమాచారం లేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!