

‘సిగ్మా’ సినిమా తన దగ్గరకు రావడం వెనుక ఓ మధురమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భం ఉందని హీరో సందీప్ కిషన్ తెలిపారు. ‘లియో’ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తనను సెట్‌కు ఆహ్వానించారని చెప్పారు. అక్కడికి వెళ్లేటప్పుడు తనకు చాలా టెన్షన్‌గా అనిపించిందని, ఆ సమయంలో లోకేశ్.. “విజయ్ సార్ నిన్ను కలవాలనుకుంటున్నారు” అని చెప్పారని వెల్లడించారు. విజయ్‌ను కలిసినప్పుడు ఆయన ‘మానగరం’తో పాటు తన మరికొన్ని సినిమాలు చూశానని, అవి తనకు నచ్చాయని చెప్పినట్లు సందీప్ గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో విజయ్ చెప్పిన ఓ మాటను తాను ఎప్పటికీ మర్చిపోలేనని సందీప్ కిషన్ తెలిపారు. “నా కొడుకు సంజయ్‌కి నువ్వంటే చాలా ఇష్టం” అని విజయ్ చెప్పారని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని బయట చెప్పొద్దని లోకేశ్ కనగరాజ్ సూచించారని తెలిపారు. ఇప్పుడు విజయ్ కుమారుడు సంజయ్ తొలి చిత్రంలో తానే హీరోగా నటిస్తున్నందున ఆ మధురమైన జ్ఞాపకాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని సందీప్ చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!