
రాజకీయాలు

కళా రంగమే కాకుండా ఏ రంగంలోనైనా ప్రతి ఒక్కరి ప్రయాణం వ్యక్తిగతమని కథానాయిక ఐశ్వర్య రాయ్ అన్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నటిగా ఇప్పటికీ ప్రతి రోజు కొత్తగా నేర్చుకుంటున్నానని చెప్పారు. సృజనాత్మక ప్రపంచంలో మనల్ని మనం తెలుసుకోవడం ఒక నిరంతర ప్రయాణమని, వ్యక్తిగత అనుభవాలే మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని ఆమె పేర్కొన్నారు.
యువతరం కృత్రిమ ప్రపంచ ప్రభావాలకు లోనవకుండా నిజ జీవితాన్ని అనుభవించాలని ఐశ్వర్య సూచించారు. మనపై మనం నిజాయతీగా ఉండి, నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆమె అన్నారు. అనుభవాలే ఒక మంచి నటుడిని తీర్చిదిద్దుతాయని, సమయం వచ్చినప్పుడు అవకాశాలు సహజంగానే వస్తాయని ఆమె స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!