

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ నిర్మాత ఎస్కేఎన్ నివాసానికి వెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి, ఆయన చేతికి రాఖీ కట్టి తన సోదర ప్రేమను చాటుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం క్రమంగా వృత్తిపరమైన సంబంధాన్ని దాటి ఆత్మీయమైన అన్నాచెల్లెళ్ల అనుబంధంగా మారినట్లు తెలుస్తోంది. నిర్మాత ఎస్కేఎన్ తనను సోదరిలా ఆదరిస్తూ ప్రోత్సహించడంతో, రాఖీ పండుగ సందర్భంగా శ్రీ గౌరీ ప్రియ తన ఆత్మీయతను, కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మాతలు, నటీనటుల మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధాలే కాకుండా ఆత్మీయమైన అనుబంధాలు కూడా ఉంటాయనే విషయాన్ని ఈ ఘటన చాటిచెప్పిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘స్క్రిప్ట్ పరిధిని దాటి ఏర్పడిన అందమైన బంధం’ అంటూ అభిమానులు వీరి అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!