
గాసిప్స్

హీరో రాజశేఖర్ సినిమా షూటింగ్లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మధ్యప్రదేశ్లో యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో ఆయన కాలి మడమకు తీవ్ర గాయం జరిగినట్లు సమాచారం.
గాయం తర్వాత వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి మూడు రోజులపాటు మెజర్ సర్జరీ చేసినట్లు టీమ్ తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని కూడా పేర్కొన్నారు.
శస్త్రచికిత్స విజయవంతం కావడంతో వైద్యులు నాలుగు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత రాజశేఖర్ మళ్లీ సినిమా షూటింగ్లో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!