

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభం కాగా, ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ తొలి ప్రచార చిత్రం సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన తెచ్చుకుంది.
ఇక ఈ చిత్రంలో మలయాళ నటి ఫెమినా జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. అల్లు అర్జున్, దీపికా పదుకొణెలాంటి ప్రముఖ నటులతో కలిసి నటించడం తనకు గొప్ప అవకాశమని ఆమె తెలిపింది. అలాగే బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు ధృవీకరించింది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!