
జనరల్

తమిళ నటుడు జయం రవి వ్యక్తిగత వివాదం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీస్తోంది. భార్య ఆర్తీ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తీవ్ర సంచలనం రేపింది. “నిద్రిస్తున్న సింహాన్ని లేపొద్దు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, అవసరమైతే నిజాలను బయటపెడతానని ఆమె స్పష్టం చేశారు.
ఈ వివాదంలో సింగర్ కెనీషా చేసిన భావోద్వేగ పోస్ట్ కూడా మరింత చర్చకు దారితీసింది. తాను ఈ బంధం నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. జయం రవి, ఆర్తీ మధ్య వివాదం ఇప్పటికే కోర్టు వరకు చేరగా, సోషల్ మీడియా పోస్టులు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి. కుటుంబ వివాదం ఇంకా ముగిసే సూచనలు కనిపించడం లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!