
సినిమాలు

అమిర్ ఖాన్ తన కుమారుడు జునైద్ హీరోగా నటించిన ‘ఏక్ దిన్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ అందుకుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమిర్ ఖాన్.. ఒక సినిమా ఫ్లాప్ అయితే తాను రెండు మూడు నెలల పాటు డిప్రెషన్‌లోకి వెళ్తానని తెలిపారు. సినిమా తమకు బిడ్డలాంటిదని, ప్రేక్షకులు మంచి కథ కోసం థియేటర్లకు వస్తారని చెప్పారు. ప్రేక్షకులు నిరాశ చెందితే అది తమ తప్పేనని పేర్కొన్న ఆయన.. సినిమా విజయం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఫెయిల్యూర్ అంతకంటే ఎక్కువ బాధను ఇస్తుందని ఎమోషనల్‌గా చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!