

హాస్యభరిత చిత్రంగా రూపొందిన హే బల్వంత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందని హాస్యనటుడు సుదర్శన్ తెలిపారు. సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల ప్రశంసలు, విమర్శకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందన్నారు. తాను పోషించిన “బంక” పాత్రకు మంచి స్పందన వస్తోందని, ప్రతి సన్నివేశంలో హాస్యం సహజంగా రావడం వల్ల ప్రేక్షకులు నవ్వులతో థియేటర్లను మార్మోగిస్తున్నారని చెప్పారు. నటీనటుల మధ్య ఉన్న అనుబంధం, సన్నివేశాల్లో సమన్వయం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణమని వివరించారు.
సినిమా రంగంలోకి అనుకోకుండా వచ్చిన తాను ప్రస్తుతం హాస్యనటుడిగా ఎదగడంపై దృష్టి పెట్టానని, ఈ దశలో కథానాయకుడిగా చేయాలనే ఆలోచన లేదన్నారు. మంచి గుర్తింపు వచ్చిన తర్వాత మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కథానాయకుడిగా చేస్తే చిన్న భావకథలతో కూడిన చిత్రాలు మాత్రమే చేయాలని భావిస్తున్నానని తెలిపారు. బిజీ కార్యక్రమాల కారణంగా కొన్ని మంచి అవకాశాలు వదులుకోవాల్సి వస్తోందని, భవిష్యత్తులో మరికొన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించనున్నట్లు వెల్లడించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!