

శీతాకాలంలో చలి కారణంగా చర్మం పొడిగా మారడం సాధారణం. ఈ సమయంలో చర్మాన్ని రక్షించడానికి కొబ్బరి నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జిడ్డుగల చర్మం, మొటిమలు ఉన్నవారికి సహాయపడుతుంది, రంధ్రాలను మూసి చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఫేస్ వాష్ వాడే ముందు కొబ్బరి నూనెను ముఖంపై అప్లై చేస్తే, చర్మంపై ఉండే మురికి, మలినాలు తొలగిపోతాయి.
కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో, మృదువుగా ఉంచడంలో, సహజ నూనెలను తొలగించకుండా ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని సాఫ్ట్‌గా, ప్రకాశవంతంగా మార్చి, యవ్వనభావాన్ని ఇస్తుంది. పరిశోధనల్లో మినరల్ ఆయిల్ కంటే కొబ్బరి నూనె ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. ఉత్తమ ఫలితాల కోసం, ముఖం, మెడ ప్రాంతాల్లో కొబ్బరి నూనెను అప్లై చేసి కొద్దిగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో నానిన క్లాత్‌తో మృదువుగా తుడవాలి.
రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె ఉపయోగించడం చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది. దీని లారిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. మొటిమలు, తామర, చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. అలాగే, కొబ్బరి నూనెలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ మంట, చికాకు, సోరియాసిస్ వంటి సమస్యలకు ఉపశమనం కల్పిస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!