

అల్పాహారం మానేయడం వల్ల శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరించారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వారు పొట్ట దగ్గర కొవ్వు పెరుగే అవకాశం 31% ఎక్కువ, ఓవర్ వెయిట్ అయ్యే ప్రమాదం 48% ఎక్కువ, స్థూలకాయానికి 44% ఎక్కువ అవకాశమున్నట్లు న్యూట్రిషనిస్ట్ పూజా మఖిజా తెలిపారు.
అల్పాహారం తినకపోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, మెదడు వెంటనే తీపి పదార్థాలను కోరుతుంది. ఫలితంగా లంచ్ లేదా సాయంత్రంలో జంక్ ఫుడ్, స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది, ఇది బరువు పెరుగుదలకు, పొట్ట దగ్గర అదనపు కొవ్వు ఏర్పడటానికి దారి తీస్తుంది.
థానేలోని కిమ్స్ హాస్పిటల్స్ డయాబెటాలజీ విభాగం హెడ్ డాక్టర్ విజయ్ నెగలూర్ ప్రకారం, అల్పాహారం మానేయడం నేరుగా సమస్యకు కారణం కాకపోవచ్చు, కానీ జీవక్రియపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఉదయం కోసం పోషకాహారంతో సమతుల్యమైన అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!