

భారతీయ ఇళ్లలో వంట నూనె రోజువారీ అవసరం. అయితే డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన నూనెను వడకట్టి మళ్లీ వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పదే పదే వేడి చేసిన నూనెలో ఫ్రీ రాడికల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఆల్డిహైడ్స్, PAH వంటి హానికర రసాయనాలు ఏర్పడతాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచి కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా LDL కొలెస్ట్రాల్ పెరగడం, ధమనుల్లో ప్లాక్ పేరుకుపోవడం, వాపులు, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు ఏర్పడి గుండె జబ్బులు, టైప్ - 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
వాడిన నూనెను వెలుతురు పడే చోట లేదా మూత లేకుండా నిల్వ చేయడం వల్ల ఆక్సీకరణ మరింత వేగంగా జరుగుతుంది. తాజా నూనెతో కలిపినా విషపదార్థాలు పూర్తిగా తొలగవు, విటమిన్ E వంటి పోషకాలు కూడా నాశనం అవుతాయి. కాబట్టి వాడిన నూనెను మళ్లీ వాడకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. డీప్ ఫ్రైకి పల్లి నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, నెయ్యి వంటి హై స్మోక్ పాయింట్ ఉన్న నూనెలు ఉపయోగించడం, నెలకు ఒకసారి నూనె రకం మార్చడం ద్వారా ఒమెగా-3, ఒమెగా - 6 సమతుల్యతను కాపాడుకోవచ్చు. చిన్న మార్పులతోనే గుండె, కాలేయం, మెదడు ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!