

ఒక కప్పు రాగి పిండి, పావు కప్పు బెల్లం, రెండు కప్పుల నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి, 10 జీడిపప్పు, 10 కిస్‌మిస్, రెండు టేబుల్ స్పూన్లు తురిమిన కొబ్బరి తీసుకుని రుచికరమైన రాగి తోప తయారు చేయవచ్చు. ముందుగా బెల్లాన్ని ఒక కప్పు నీటిలో కరిగించి పక్కన పెట్టాలి. తరువాత రాగి పిండిని అర కప్పు నీటితో ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు పాన్‌లో బెల్లం నీటిని మరిగించి, అందులో రాగి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి.
మిశ్రమం గట్టిపడే వరకు మీడియం మంటపై కలుపుతూ ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, తురిమిన కొబ్బరి వేసి మరికొన్ని నిమిషాలు ఉడికించాలి. మరో పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ను వేయించి ఈ మిశ్రమంలో కలపాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసి కలిపి దించాలి. అవసరమైతే పాలతో కూడా తయారు చేయవచ్చు. పంచదారకు బదులు బెల్లం ఉపయోగిస్తే రుచి మరింత పెరుగుతుంది. బాదం, జీడిపప్పు పొడి కలిపితే మరింత రుచికరంగా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!