

మన దేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది భావోద్వేగానికి ప్రతీక. అయితే టీని ఎక్కువసేపు మరిగిస్తే అది చేదుగా మారుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం దీనికి సమాధానం తయారీ విధానంపై ఆధారపడి ఉంటుంది. టీ ఆకుల నాణ్యతతో పాటు నీటి ఉష్ణోగ్రత, మరిగించే సమయం, తయారీ పద్ధతి టీ రుచిని ప్రభావితం చేస్తాయి.
టీ ఆకుల్లోని పాలీఫెనాల్స్, కెఫిన్ వంటి సహజ సమ్మేళనాలు ఎక్కువ వేడి నీటిలో ఎక్కువసేపు మరిగితే అధికంగా విడుదలై రుచి ఘాటుగా, చివరికి చేదుగా మారుతుంది. దీనిని ఓవర్ ఎక్స్‌ట్రాక్షన్ అంటారు. గ్రీన్ టీ, వైట్ టీలు త్వరగా చేదుగా మారుతాయి కాబట్టి ఎక్కువ మరిగించకూడదు. అయితే బ్లాక్ టీ, మసాలా చాయ్‌లో పాలు, మసాలాలు కలిపి కొంతసేపు మరిగిస్తే ఫ్లేవర్ పెరుగుతుంది. కానీ సరైన సమతుల్యత అవసరం. స్టీపింగ్ విధానంలో తేలిక రుచి, బాయిలింగ్‌లో ఘాటు రుచి వస్తుంది. అలాగే నీటిని మళ్లీ మళ్లీ మరిగించడం రుచిని తగ్గిస్తుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!