

వేసవి కాలం మొదలైతే అందరి దృష్టి పండ్ల రాజు మామిడిపైనే ఉంటుంది. ఆ రుచి, సువాసనకు మాయమవ్వని వారు ఉండరు. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు మాత్రం మామిడి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయేమో, ఒళ్లు వేడి చేస్తుందేమో అని ఆందోళన చెందుతారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, మామిడి పండ్లను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉన్నప్పటికీ, గ్లైసెమిక్ ఇండెక్స్ 51 నుంచి 56 మధ్యలో ఉండటం వల్ల నియంత్రిత మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు.
మధుమేహులు మామిడిని రోజుకు అర కప్పు ముక్కలుగా లేదా చిన్న ముక్క పరిమాణంలో తీసుకోవచ్చు. దీనిని ఒంటరిగా కాకుండా నట్స్, విత్తనాలు, పెరుగు వంటి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది. జ్యూస్ లేదా షేక్‌ల రూపంలో కాకుండా పండుగా తినడం వల్ల పీచు పదార్థం లభించి గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడుతుంది. మామిడి వల్ల ఒళ్లు వేడి పెరుగుతుందని లేదా మొటిమలు వస్తాయని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. తినే ముందు నీటిలో నానబెట్టడం వల్ల మురికి, పురుగుమందుల అవశేషాలు తొలగిపోతాయి. మామిడిలో ఉన్న నీరు, పొటాషియం, విటమిన్ ఏ, సి వంటి పోషకాలు వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే ప్యాకేజ్డ్ మామిడి జ్యూస్‌లను మాత్రం దూరంగా ఉంచడం ఉత్తమం.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!